TCS NQT 2022 Registration: టీసీఎస్‌లో జాబ్ సొంతం చేసుకునే ఛాన్స్.. ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ ఎవరైనా అర్హులే.. అయితే ఇలా చేయండి..!
TCS NQT 2022 Registration: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ 2022.. జులై సెషన్ నోటిఫికేషన్ విడుదలైంది. TCS NQT 2022 లో అర్హత సాధించిన వారికి దేశవ్యాప్తంగా ఉన్న టీసీఎస్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ఈ పరీక్షకు ఇంజినీరింగ్, ఆర్ట్స్, కామర్స్, సైన్స్/ డిప్లొమా గ్రాడ్యయేట్స్ అప్లయ్ చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జూన్ 25 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. జులై 10వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
TCS National Qualifier Test 2022 – July session
- అర్హత: యూజీ, పీజీ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ అభ్యర్థులు అర్హులు.
- ఎంపిక విధానం: నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ (ఎన్‌క్యూటీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దీన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ స్కోరుకు రెండు సంవత్సరాల వరకు వాలిడిటీ ఉంటుంది.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేది: జూన్ 25, 2022
- TCS NQT 2022 పరీక్ష తేది: జులై 10, 2022 నుంచి ప్రారంభమవుతుంది.
- నోటిఫికేషన్:https://learning.tcsionhub.in/hub/national-qualifier-test/
పరీక్షా విధానం:
TCS NQT పరీక్షలో మొత్తం 92 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 180 నిమిషాలు ఉంటుంది. ఇందులో 5 విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. వివరాల్లోకెళ్తే..
- వర్బల్ ఎబిలిటీ – 24 ప్రశ్నలు – 30 నిమిషాలు
- రీజనింగ్ ఎబిలిటీ- 30 ప్రశ్నలు – 50 నిమిషాలు
- న్యూమరికల్ ఎబిలిటీ- 26 ప్రశ్నలు – 40 నిమిషాలు
- ప్రోగ్రామింగ్ లాజిక్- 10 ప్రశ్నలు – 15 నిమిషాలు
- కోడింగ్ – 02 ప్రశ్నలు – 45 నిమిషాలు
Tech companies join UK four day work week trial: యూకేకు చెందిన 60 కంపెనీలకు పైగా జూన్ నుంచి వారానికి నాలుగు రోజుల పాటు వర్క్ (Four Day Work Week) చేసే వెసలుబాటు కల్పిస్తున్నాయి. ప్రారంభంలో ఈ కొత్త వర్క్ కల్చర్‌పై 3వేల మంది ఉద్యోగులపై ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ ట్రయల్స్‌లో ఉద్యోగులు ప్రొడక్టివిటీ, అట్రిషన్ రేట్, రిజిగ్నేషన్ తో పాటు ఇతర అంశాల్లో సత్ఫలితాలు రాబడితే శాశ్వతంగా వర్కింగ్ డేస్‌ను కుదించే అవకాశాలున్నాయి.
ఇక.. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే స్పెయిన్, ఐస్‌ల్యాండ్,యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ దేశాలకు చెందిన సంస్థలు సైతం యూకే బాటలో పయనించనున్నాయి.
ఇక ఇప్పటికే.. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ప్యానాసోనిక్ (Panasonic) కొత్త వర్క్ పాలసీని అమలు చేస్తోంది. ఫోర్ డే వర్క్ వీక్ (4 Day Work Week) అంటే వారంలో కేవలం నాలుగు రోజులు మాత్రమే విధులు నిర్వహిస్తే చాలని ప్రకటించింది. అంటే ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు డ్యూటీ చేస్తే చాలు. ప్రస్తుతం చాలావరకు కంపెనీలు వారంలో ఐదు రోజులు కార్యకలాపాలు నిర్వహిస్తూ.. రెండు రోజులు వీక్ ఆఫ్ ఇస్తున్న సంగతి తెలిసిందే.
Panasonic సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 2,40,000 పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. పోటీతత్వం పెంచడం కోసం ప్రతీ ఉద్యోగి శ్రేయస్సు కోసం మా సహకారం ఉంటుందని, ఉద్యోగానికి, జీవనశైలికి మధ్య సమతుల్యత సాధించేలా చేయడం మా బాధ్యత అని ప్యానాసోనిక్ సీఈఓ యుకి కుసుమి వివరించారు.
అలాగే.. Panasonic సంస్థ వారానికి నాలుగు రోజుల పనితో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కూడా అమలు చేయనుంది. తమ ఉద్యోగుల జీవిత భాగస్వామి మరో ప్రాంతానికి బదిలీ అయితే, అలాంటి ఉద్యోగులు ఇబ్బంది పడకుండా, ఉద్యోగం మానెయ్యాల్సిన అవసరం లేకుండా ఈ పద్ధతి ఉపయోగపడుతుందని ప్యానాసోనిక్ ప్రకటించింది.
పనిదినాల్ని కుదించడంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారానికి నాలుగు రోజులు పనిచేయడం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొంటున్నారు. కుటుంబసభ్యులతో గడపడమే కాదు. హయ్యర్ స్టడీస్‌తో పాటు కొత్త అంశాలను, కొత్త టెక్నాలజీలను నేర్చుకునే వెసులుబాటు ఉంటుందని చెబుతున్నారు.