‘చిలకలూరిపేట’ ఓటర్ ‘ఎటువైపు’ !
‘చిలకలూరిపేట’ ఓటర్ ‘ఎటువైపు’:
రాజకీయాలు వేరు అంచనాలువేరు అని తరచుగా రాజకీయనాయకులు ఉదహరిస్తుంటారు, సరిగ్గా గుంటూరు రాజకీయాలు ఇలాగే ఉంటాయి. మరీ ప్రధానంగా ‘చిలకలూరిపేట’ నియోజకవర్గం టీడీపీకి ‘కంచుకోట’గా ఉంది.
ఈ నియోజకవర్గం నుంచి ‘2009 | 2014’ ఎన్నికల్లో వరుస విజయాలు కైవసం చేసుకున్న ‘ప్రత్తిపాటి పుల్లారావు’ మంత్రిగా కూడా ‘చక్రం’ తిప్పుతు న్నారు, ఇప్పుడు మరోసారి తలపడుతున్నారు.

‘చిలకలూరిపేట’ ఓటర్ ‘ఎటువైపు’
ఇక, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తరపున బీసీ వర్గానికి చెందిన ‘ఎన్నారై’ విడదల ‘రజనీ’కి అవకాశం కల్పించారు, దీంతో ఆమె ఎన్నికలకు దాదాపు ఆరు మాసాలకు ముందుగానే ఇక్కడ చక్రం తప్పుతున్నారు.
ప్రతి ఒక్కరినీ కలుపుకుపోయే తత్వం అలాగే బీసీ కార్డును వినియోగించడం, ప్రభుత్వ వైఫల్యాలు, సమ స్యలను కూడా ఆమె ఇంటింటికీ ప్రచారం చేయడం, మహిళా సెంటిమెంటు కూడా వర్కవుట్ అవుతుం దని అంటున్నారు.
ఇక బలా బలాలు చూస్తే,
- ‘పుల్లారావు’ మంత్రిగా చేసిన ‘అనుభవం’, అందరిని కలుపుకుపోవటం, మరి ముఖ్యంగా సంప్రదాయ ఓటింగ్.
- విడదల రజిని బీసీ వర్గానికి చెందిన మహిళ కావటం, మహిళా సెంటిమెంట్, ప్రభుత్వ వ్యతిరేకత, ప్రతిపక్షంపై సానుభూతి.
ఈ ‘నియోజకవర్గం’లో ప్రజల ఆలోచనా ధోరణి కూడా అంచనాలకు అందడం లేదు, ‘హోరా హోరి’ గా ఉంటుందని ‘ఇన్సైడ్ టాక్’.
Read Also: https://www.legandarywood.com