జాతకరీత్యా చంద్రబాబే మళ్ళీ సీఎం !

జ్యోతిస్కుని మాటల్లో.. చంద్రబాబే మళ్ళీ సీఎం :

‘ఏపీ’ లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో టీడీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు ‘ముఖ్యమంత్రి’ అవుతారని శ్రీరాజరాజేశ్వరి జ్యోతిషాలయ వ్యవస్థాపకుడు సుబ్రహ్మణ్యస్వామి ‘జోస్యం’ చెప్పారు.

ఆయన మాట్లాడుతూ, ఏపీలో 120 – 130 అసెంబ్లీ సీట్లను టీడీపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. చంద్రబాబు జాతకరీత్యా సప్తమ స్థానంలో గురువు బలం బ్రహ్మాండంగా ఉందని చెప్పారు.

 

జాతకరీత్యా చంద్రబాబే మళ్ళీ సీఎం

జాతకరీత్యా చంద్రబాబే మళ్ళీ సీఎం

 

వైసీపీ అధినేత జగన్ జాతకరీత్యా జన్మస్థానంలో రాహువు ఉండటంతో, ఆయన గ్రహబలం బాగోలేదని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. వైసీపీ కేవలం 35 – 45 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గ్రహబలం కూడా కొంచెం పరవాలేదని, ఆ పార్టీకి 10 – 15 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

  • 2011లో తమిళనాడులో జయలలిత అధికారంలోకి వస్తారని, 2014 ఎన్నికల్లో ప్రధానిగా మోదీ, సీఎంగా చంద్రబాబు అవుతారని తాను చెప్పానని, తాను చెప్పినట్టే జరిగిందని అన్నారు.
  • జ్యోతిస్కుని మాటల్లో చెప్పాలంటే కెసిఆర్ ఆస్థాన జ్యోతిస్కుడు ఎలాగైతే కెసిఆర్ మళ్ళీ సీఎం అవుతారని చెప్పారో, అలాగే చంద్రబాబుకు మళ్ళీ యోగం ఉందని మళ్ళీ ఆయనే ఏపీ కి సీఎం అవుతారని చెప్పారు.

మొత్తంగా చూస్తుంటే జగన్, జనసేనాని కల నెరవేరాలంటే మరో 5 సంవత్సరాల నిరీక్షణ తప్పేలాలేదు.

About the Author

Leave a Reply

*