The original story of a vehicle washed up on the Srikakulam beach !

శ్రీకాకుళం సముద్రతీరానికి కొట్టుకువచ్చిన వాహనం అసలు కథ :
ఏపీని అతలాకుతలం చేస్తున్న ‘అసాని’ తుపానుతో ‘ఈదురుగాలులు | భారీ వర్షాలతో’ పాటు సముద్రం అల్లకల్లోలంగా ఉండటమే కాకుండా…. పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతుంటాయి. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి సముద్రతీరానికి దేవుడి ఊరేగింపులో ఉపయోగించే ఒక వింత వాహనం కొట్టుకువచ్చింది. అది బంగారం రథంగా అందరూ చెప్పారు. బంగారు వర్ణంతో ధగధగ మెరిసేలా ఉన్న దీన్ని చూసేందుకు జనాలు తరలివచ్చారు. ఇది నిజంగా బంగారందేమోనని అందరూ భావించారు.

మయన్మార్ లో ఎవరైనా యువతీ యువకులు బౌద్ధమతంలో చేరి సన్యాసం స్వీకరించే ముందు భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో సముద్రతీరానికి కొట్టుకువచ్చిన వాహనం కూడా ఇలాగే కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. ఊరేగింపు నిర్వహించిన తర్వాత ఈ వాహనాన్ని సముద్రంలో నిమజ్జనం చేసి ఉంటారు.

ఈ వాహనంపై జనవరి 16 అనే తేది కూడా కనిపిస్తోంది. అంటే దీన్ని నాలుగు నెలల క్రితమే రూపొందించి ఉంటారు. ఈ వాహనం జనవరి 16 అనే తేదీ కూడా కనిపిస్తోంది. ఈ వాహన రూపురేఖలు డిజైన్స్ అంతా బౌద్ధమతం థీమ్ లో ఉంది.

మూడు నెలల క్రితం కూడా ఇలాంటి వాహనం ఒకటి నెల్లూరు జిల్లాలోని తీరప్రాంతానికి కొట్టుకువచ్చింది. కాని అది చాలా పాతగా కనిపించింది. అందులో బుద్ధుడి ప్రతిమ, చిత్రంతో పాటు శివలింగం కూడా ఉంది.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేండింగ్ అవుతుంది.

About the Author

Leave a Reply

*