Third Wave ready to come to create Tsunami in India !
భారతదేశం మదిలో థర్డ్ వేవ్ అలజడి:
కరోనా సెకండ్ వేవ్ భీభత్సానికి భారతదేశం చిగురుటాకులా వణికిపోయింది అయితే ప్రస్తుతం కేసులు తగ్గి పరిస్థితి అదుపులోకి వస్తున్న తరుణంలో… థర్డ్ వేవ్ తప్పదన్న హెచ్చరికలు మాత్రం భయపెట్టిస్తున్నాయి.
తమిళనాడు లో కరోనా తో సింహం మృతి చెందింది. ఈ సింహం కు డెల్టా వేరియంట్ వైరస్ సోకినట్లు సమాచారం. వండలూర్ అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ లో ఈ ఘటన చోటు చేసుకుంది… సింహాలకు డెల్టా వేరియంట్ వైరస్ సోకినట్లు నిర్ధారించింది భూపాల్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసిసస్.
డెల్టా ప్లస్ వేరియంట్ తో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని మహారాష్ట ఆరోగ్యశాఖ అధికారులు చెబుతుండటంతో అధికారులు అలెర్టయ్యారు. మరోవైపు థర్డ్ వేవ్ వస్తే మాత్రం సెకండ్ వేవ్ కు రెట్టింపు సంఖ్యలో కేసులు వస్తాయంటూ మహారాష్ట్ర కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ వైద్య నిపుణుల బృందం చేసిన హెచ్చరికను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది.
అలాగే ప్రజల్లో కూడా థర్డ్ వేవ్ పట్ల అవగాహన పెంచాలని చెప్పారు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం అతితొందరలోనే థర్డ్ వేవ్ రావచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో స్పీడ్ పెంచాల్సిన ఆవశ్యకత ఉందంటున్నారు వైద్యులు.
థర్డ్ వేవ్ అక్టోబర్ – నవంబర్ మాసాలలో…. భారతదేశంలో సునామి సృష్టిస్తుందని అంచనా.