Logo

Three days holidays in a week @ In coming days !

ఉద్యోగులకు శుభవార్త….వారానికి 4 రోజులే పనిదినములు :

నేటి రోజుల్లో వారానికి 6 రోజులు, పని గంటలు దాదాపు 8 గంటలు చేయాలి, సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే వారంలో ఐదు రోజులు పని చేస్తే… వారాంతంలో రెండు రోజులు సెలవు దొరుకుతుంది. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తున్నరూల్. అయితే ఎక్కువ రోజులు సెలవులు వస్తే బాగుండు అని కోరుకునే వారికి శుభవార్త…. మరికొన్ని రోజుల్లో వారి కోరిక తీరబోయే లాగే కనిపిస్తుంది.

ప్రస్తుతం ఉన్న సెలవుల నిబంధనలో ఎన్నో మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దేశంలో కొత్తగా కార్మిక చట్టాల ప్రకారం వారంలో కేవలం నాలుగు రోజులు పని మూడు రోజులు సెలవు దినాలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్ కోసం ప్రస్తుతం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ఈ కొత్త నిబంధనల ప్రకారం కంపెనీ ఉద్యోగులు పరస్పర అంగీకారం ద్వారా ఒప్పందం చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుందట.

ప్రస్తుతం ఏ ఉద్యోగానికి వెళ్ళిన 8 నుంచి 9 గంటల పాటు పనిచేస్తున్నారు. అయితే కొత్త కార్మిక చట్టాల ప్రకారం నాలుగు రోజుల పనిదినాలు ఉంటే ఇక 8 నుంచి 9 గంటలకు కాదు ఏకంగా 12 గంటల పాటు పనివేళలు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం, ఇక ఈ ఎంపికను అటు కొత్త లేబర్ చట్టం లో కూడా పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా వారం మొత్తంలో 48 గంటల పనిని గరిష్ట పరిమితిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇదే జరిగితే… మూడు రోజుల సెలవు దినములు ఉద్యోగుల పాలిట యమపాశం కానుంది.

About the Author

Leave a Reply

*