ఈ రోజు ఈ ఒక్క పని చేస్తే !
ఈ రోజు ఈ ఒక్క పని చేస్తే:
ఈ రోజు వ్యాస గురు పూర్ణిమ (16 / జులై /2019) | కూడిన చంద్రగ్రహణం. ముందుగా వ్యాస భగవానుని స్మరించుకుంటూ,
ఆషాడం నుంచీ కార్తీకం వరకూ ఐదు మాసాలకు వ్యాసపూర్ణిమలు అని పేరు.
వేదవ్యాసుని స్మరిస్తూ ఆషాడపూర్ణిమను గురుపూర్ణిమ గా వ్యవహరిస్తారు.
ద్వాపరగుగాంతములో అపారమైన వేదరాశిని స్వీకరించి నాలుగు వేదాలుగా విభజించి, అష్టాదశ పురాణాలనూ, మహాభారతాన్ని, మహాభాగవతాన్ని రచించి, సమగ్ర ధర్మాన్ని ఏకత్రగా అందించిన నారాయణావతారము విష్ణువు. ఆయన అసలు పేరు కృష్ణుడు | సత్యవతీ పరాశరులకు ఒక ద్వీపములో ఉధ్భవించినందున కృష్ణద్వైపాయనుడు అని పేరు.

ఈ రోజు ఈ ఒక్క పని చేస్తే
వ్యాసోచ్చిష్టం జగత్సర్వం అతని ఉచ్చిష్టమే ఈ జగత్తులోని సమస్త వాజ్ఙమయము.
‘గురుబ్రహ్మ: గురువిష్ణు: గురుదేవో: మహేశ్వర: గురుసాక్షాత్ పరబ్రహ్మ: తస్మైశ్రీ గురవే నమ:’’
సదాశివ సమారంభాం
శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతం
వందే గురు పరంపరాం!
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః
కృష్ణంవందే జగద్గురుమ్…
గురు పౌర్ణమి రోజు ప్రతీ హిందువు పఠించవలసిన శ్లోకాలు..
వ్యాసపీఠంపై వ్యాసదేవుని ఏగ్రంథమైనా (పురాణాల్లోనివి గానీ, భాగవతం గానీ) ఉంచి, అందు వ్యాసదేవుని ఆవాహన చేసి షోడశోపారాలతో పూజించాలి.
తదుపరి చంద్రగ్రహణం గురుంచి చూస్తే,
ఆషాఢ శుద్ధపూర్ణిమ మంగళవారం అనగా 16 / జులై /2019 తేదీ రాత్రి చంద్రగ్రహణం
పట్టుకాలం – 1 :35 ని||| లకు
మధ్యకాలం – ౩ : 03 ని||| లకు</p
విడుచుకాలం – 4 : 31 ని||| లకు
గ్రహణ ఆద్యంత పుణ్యకాలం – 2 : 57 ని||| లకు
ఈ గ్రహణం ఉత్తరాషాఢ నక్షత్రం మరియు ధను, మకర రాశియందు సంభవించుచున్నది. కావున, ఈ జాతకులు గ్రహణం వీక్షించరాదు.
నిత్య భోజన | ప్రత్యాబ్దికములు : గ్రహణం రాత్రి కావున, ప్రత్యాబ్దికములు, మధ్యాహ్న భోజనములు, రాత్రి భోజనములు యధావిధిగా నిర్వహించుకొన వచ్చును.
Read Also: http://www.legandarywood.com