TS EAMCET 2022: తెలంగాణ ఎంసెట్‌ అభ్యర్థులకు అలర్ట్‌.. దరఖాస్తుకు నేడే ఆఖరు తేది

TS EAMCET Exam Date 2022: ఇక.. ఆల‌స్య రుసుముతో జూన్ 17 వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. అగ్రిక‌ల్చ‌ర్, మెడిక‌ల్ విభాగం పరీక్షను జూలై 14, 15వ తేదీల్లో, ఇంజినీరింగ్ (Engineering) విభాగం పరీక్షను జూలై 18, 19, 20వ తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. తెలంగాణ ఎంసెట్‌కు ఇప్పటి వరకు సుమారుగా రెండు లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.

TS EAMCET 2022: తెలంగాణ ఎంసెట్ 2022 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే (మే 28) ఆఖరు తేది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఇంట‌ర్ తర్వాత ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్‌, మెడిక‌ల్ కోర్సులో ప్ర‌వేశాలు క‌ల్పిస్తున్న సంగతి తెలిసిందే. టెక్నాలజీ, ఇంజ‌నీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాలు పొందాలనుకునే అభ్య‌ర్థులు మ్యాథ‌మెటిక్స్‌, కెమిస్ట్రీ/ బ‌యోటెక్నాల‌జీ/బ‌యోల‌జీ స‌బ్జెక్టుల్లో ఇంజ‌నీరింగ్ చేసి ఉండాలి/ ఆప్ష‌న‌ల్, ఒకేష‌న‌ల్ కోర్సుల ఉత్తీర్ణ‌త/డిప్లొమా చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువ‌తున్న వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఇక.. ఆల‌స్య రుసుముతో జూన్ 17 వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. అగ్రిక‌ల్చ‌ర్, మెడిక‌ల్ విభాగం పరీక్షను జూలై 14, 15వ తేదీల్లో, ఇంజినీరింగ్ (Engineering) విభాగం పరీక్షను జూలై 18, 19, 20వ తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. తెలంగాణ ఎంసెట్‌కు ఇప్పటి వరకు సుమారుగా రెండు లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.

TS EAMCET 2022 లో ర్యాంకులు కేటాయించడానికి ఇంటర్ పాస్ అయితే చాలు అని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంటర్ మార్కులకు సైతం 25 శాతం వెయిటేజీ ఉండేది. కానీ ఈ సారి ఎంసెట్ ర్యాంకులు కేటాయించడానికి ఇంటర్ పాస్ అయితే చాలని.. కేవలం ఎంసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంసెట్‌ ర్యాంక్‌ కేటాయించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.

TS Inter Academic Calendar 2022-23: ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. 2022-23 అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల.. పరీక్షలు, సెలవుల తేదీలివే
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. ఇంటర్మీడియట్‌ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. 221 పని రోజులతో విద్యా సంవత్సరాన్ని తెలంగాణ ఇంటర్ బోర్డు ఖరారు చేసింది. తరగతులు, పరీక్షలు, సెలవులకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. జూలై 1న ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. జూన్‌ 15న సెకండియర్‌ తరగతులు ప్రారంభమవుతాయని ఇంటర్‌ బోర్డు తెలిపింది. అక్టోబర్‌ 2 నుంచి 9 వరకు ఇంటర్‌ విద్యార్థులకు దసరా సెలవులు కాగా.. 2023, జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని పేర్కొంది.

అలాగే.. ఫిబ్రవరి 6 నుంచి 13 వరకు ప్రి ఫైనల్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6వ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్‌ పరీక్షలు జరుగుతాయని.. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వ వరకు ఇంటర్‌ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి మే 31 వరకు వేసవి సెలవులుంటాయని.. జూన్‌ 1 కాలేజీలు పునఃప్రారంభమవుతాయని పేర్కొంది. 2023 మే చివరి వారంలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. పూర్తి వివరాలను ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in/ లో చూడొచ్చు.

About the Author

Leave a Reply

*