Unmarried offerings Matrimonial and Increments each year !
పెళ్లికాని ప్రసాదులకు…పెళ్లి సంబంధాలు…ప్రతి ఏడాది ఇంక్రెమెంట్స్:
కరోనా మహమ్మారి సునామి వల్ల గడచిన 2 సంవత్సరాల్లో వేల కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి | సరైన ఆశ్రయం | కనీస సదుపాయాలు లేక | సొంత గూటికి చేరుకోలేక | ఇప్పటికి అవస్థలు పడుతున్నారు. ఈ మహమ్మారిని సాకుగా చూపి ఉన్న ఉద్యోగాల్లో 20 – 30 % కోత…అలాగే ఉద్యోగుల శ్రమను దోపిడీ చేస్తూ నానా హంగామా చేస్తున్న ఈ రోజుల్లో…పెద్ద కంపెనీలకు చెక్ పెడుతూ ‘శ్రీమూకాంబికా ఇన్ఫో సొల్యూషన్స్’ యజమాని ఉద్యోగుల పాలిట నిజంగానే దేవుడిగా మరాడు.
2006లో శివకాశిలో ప్రారంభమైన ‘శ్రీమూకాంబికా ఇన్ఫో సొల్యూషన్స్’ సాఫ్ట్ వేర్ కంపెనీ క్రమంగా వృద్ధి చెంది 2010కి మధురైకి మార్చబడింది. సదురు కంపెనీ ‘ఫౌండర్ | సీఈవో సెల్వగణేష్’ తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఏడాదికి రెండు సార్లు ఇంక్రిమెంట్ ఇస్తామని తెలిపారు. అదేవిధంగా సరైన పెళ్లికానికి వారికి సరైన సంబంధాలను చూడడానికి కంపెనీలో ప్రత్యేక విభాగాన్ని ఆయన ఏర్పాటు చేసి గొప్ప పుణ్యం కట్టుకున్నారు. పెళ్లి చేసుకుంటే కూడా ప్రత్యేకమైన ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రకటించారు.
ప్రస్తుతం ఈ సాఫ్ట్ వేర్ కంపెనీలో 40శాతం ఉద్యోగులు సుమారు ఐదేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. ఇలాంటి ‘ఇంక్రిమెంట్లు | పెళ్లి సంబంధాలు’ చూడడం వల్ల ఉద్యోగులు ఇతర కంపెనీలకు మారాలన్న ఆలోచనలను మానుకుంటారని…ఉద్యోగులలో పనిపట్ల ‘నిజాయితీ | ఉత్పాదకత’ పెరుగుతుందని సీఈవో చెబుతున్నారు.
ఇలాంటి యజమాని ఒక్కరుంటే చాలు ఆయన వద్ద పనిచేయడం మేలు అని చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉద్యొగులకోసం…ఈ కంపెనీ చేస్తున్న కృషి…ఉద్యోగుల శ్రమను దోపిడీ చేసే…పెద్ద కంపెనీలకు గొడ్డలి పెట్టు.