ఆ డేటింగ్ గురించి చెప్పవేంటి తాప్సీ !!!

ఆ డేటింగ్ గురించి చెప్పవేంటి తాప్సీ :

 

ఆ డేటింగ్ గురించి చెప్పవేంటి తాప్సీ

ఆ డేటింగ్ గురించి చెప్పవేంటి తాప్సీ

 

హీరోయిన్స్ గురించి ఈ మధ్య రూమర్స్ ఏ స్థాయిలో వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ప్రభావమో హీరోయిన్స్ జాగ్రత్త లోపమో తెలియదు గాని పర్సనల్ వ్యవహారాలు కూడా అందరికి తెలిసిపోతున్నాయి. అది ఎంతవరకు నిజమనేది కూడా ఎవ్వరికి తెలియదు. కానీ రూమర్స్ మాత్రం వస్తూనే ఉంటాయి. ఝుమ్మంది నాథం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన తాప్సి ప్రస్తుతం బాలీవుడ్ లో తన రేంజ్ ను పెంచుకుంటోంది.  అయితే అమ్మడిపై ఎప్పుడూ లేని విధంగా రూమర్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. రీసెంట్ గా జూడ్వా సినిమాతో మంచి హిట్ అందుకున్న తాప్సి ఇప్పుడు అవకాశాలను బాగానే దక్కించుకుంటోంది.

అంతే కాకుండా ముందు ముందు మరింత బిజీ అవ్వనుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే అమ్మడు ఈ ఇలాంటి టైమ్ లో ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ తో డేటింగ్ చేస్తోందనే వార్తలు వస్తున్నాయి.

తాప్సి 2013 లో జరిగిన ఇండియన్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ లో ఓ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది. అయితే అప్పుడు మతియాస్ బో అనే డానిష్ ప్లేయర్ తో స్నేహం పెంచుకొని ప్రస్తుతం డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని అమ్మడు మాత్రం ఇంతవరకు ఏ వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. 

 

Read Also: http://www.legandarywood.com/anasuya-sets-fashion-goals/

About the Author

Leave a Reply

*