Logo

Young hero in live cast defamed !

లైవ్ లో.. యంగ్ హీరో పరువు తీసిన… టీవీ9 యాంకర్:

‘టాలెంట్ | ఓవర్ అగ్రెషన్’ ఆటిట్యూడ్ ఉన్న నటుల్లో ముందువరుసలో ఉంటారు ‘పాగల్’ ఫేమ్ విశ్వక్సేన్, ఫ్రాంక్ వీడియో | ఆర్గ్యుమెంట్స్ తో విభిన్నంగా సినిమాను ప్రమోట్ చేయటంలో దిట్ట. తాజాగా ఈ హీరో మూవీ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా మే 6న థియేటర్లలో విడుదల కాబోతోంది.

ప్రొమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ ఫిలింనగర్ వైపుగా వెళ్తుండగా.. ఓ యువకుడు కారుకు అడ్డంగా పడుకొని… వినూత్నంగా…పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకోడానికి ట్రై చేసినట్లు ఓ ఫ్రాంక్ వీడియోతో నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేశాడు. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో విశ్వక్ సేన్ పోషించిన పాత్ర అల్లం అర్జున్ కుమార్ కు 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు. దాన్ని తట్టుకోలేకపోతున్నా… అందుకే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుంటా అంటూ సీన్ క్రియేట్ చేశారు.

హీరో గారు సైతం తనకేం తెలియనట్లు ఆ డ్రామాను రక్తికట్టించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఆత్మహత్యాయత్నం పేరుతో, ఫ్రాంక్ వీడియోతో నడిరోడ్డుపై రచ్చ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేయడం పై నెటిజన్లు ఫైర్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ పేరిట న్యూసెన్స్ చేస్తున్నారంటూ హీరో విశ్వక్ సేన్ పై అడ్వొకేట్ అరుణ్ కుమార్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

దీనిపై వివరణ ఇచ్చేందుకు సదరు హీరో గారు, సోమవారం ఉదయం ‘Tv9 స్టూడియో డిబేట్’ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను ఉద్దేశిస్తూ ‘డిఫ్రెష్డ్ పర్సన్’ ‘పాగల్ సేన్’ అని యాంకర్ పేర్కొనడంపై విశ్వక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పరువునష్టం దావా వేసే హక్కు తనకు ఉందని.. కానీ తాను అలా చేయనని అన్నారు.

ఈ క్రమంలో సహనం కోల్పోయిన యాంకర్.. ‘గెట్ ఔట్’ అంటూ షో నుంచి విశ్వక్ సేన్ ను వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. ఈ డిబేట్ కు పిలిచింది మీరే అనే విషయాన్ని ప్రస్తావిస్తూ విశ్వక్ బయటకు వచ్చేసారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ నెట్టింట హల్చల్ చేస్తుంది.

ఏదిఏమైనా… ఈ విభిన్నమైన ఆటిట్యూడ్ తో…సినిమాను ప్రమోట్ చేయటంలో బిజీగా ఉన్నారు మూవీ మేకర్స్. ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టి…విశ్వక్సేన్ కు మంచి బ్రేక్ ఇవ్వాలి అని కొరుకుంటూ… మీ లెజండరీవుడ్ .

About the Author

Leave a Reply

*