ఇకపై మా అమ్మాయి హీరోయిన్: కమెడియన్ పృథ్వీ

తెలుగులో హాస్యనటీనటుల సంఖ్య చాలా ఎక్కువ. ఇంకా ఎమ్మెస్ .. ఏవీఎస్ .. ధర్మవరపు … వేణు .. కొండవలస లేకపోవడం కృష్ణభగవాన్ సినిమాలకు దూరంగా ఉండటం జరిగింది. ఇక సప్తగిరి .. షకలక శంకర్ వంటి యంగ్ కమెడియన్స్ హీరోల వేషాల వైపు వెళ్లడం వలన ఈ మధ్య కామెడీ బృందం కాస్త పలచబడింది. అయితే తెరపై నిండుగా కమెడియన్స్ అంతా పండుగ చేస్తున్న సమయంలోనే పృథ్వీ స్టార్ కమెడియన్ అనిపించుకున్నాడు. ఒకానొక సమయంలో ఆయన లేని సినిమా అంటూ ఉండేది  కాదు.

పృథ్వీ కోసమే ప్రత్యేకమైన పాత్రలు .. వాటికి ఇంట్రెస్టింగ్ మేనరిజమ్స్ ను  క్రియేట్ చేశారు. అదృష్టం కలిసొచ్చి ఆ మధ్యలో ఆయన చేసిన పాత్రలన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆయన ఫుల్ బిజీ అయ్యారు. కొన్ని కారణాల వలన ఆ మధ్య ఆయనకి అవకాశాలు తగ్గినప్పటికీ .. మళ్లీ ఇప్పుడిప్పుడే పుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఆయన కూతురు ‘శ్రీలు’ హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు.

“మా అమ్మాయి ‘శ్రీలు’కి మొదటి నుంచి కూడా సినిమాల పట్ల ఆసక్తి ఎక్కువ. అలాగే నటన అంటే కూడా చాలా ఇష్టం. అయినా హోటల్ మేనేజ్ మెంట్ చేయడం కోసం మలేసియా వెళదామని అనుకుంది. కానీ ఈ లోగానే సినిమాలో చేసే  ఛాన్స్ వచ్చింది. నా  స్నేహితుడి కుమారుడు క్రాంతి హీరోగా ఒక సినిమా ద్వారా పరిచయమవుతున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా మా అమ్మాయి ‘శ్రీలు’ను తీసుకున్నాడు. ముగ్గురు యువకులు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిర్మాణ రంగానికి కొత్త అయినా ఖర్చుకు వెనుకాడలేదు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. ఆదిత్య  ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. పాటలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. సినిమా చాలా బాగా వచ్చింది .. పారితోషికం తీసుకోకుండా దర్శకుడు ఈ సినిమా చేశాడు. ఆయన ఎవరనేది త్వరలోనే మీకు చెబుతాను. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనీ  హీరో హీరోయిన్స్ కెరియర్ కి ఈ సినిమా ప్లస్ అవుతుందని నేను భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

About the Author

Leave a Reply

*