Techies lost their jobs more than 80 thousand

In the first quarter techies lost their jobs more than 80 thousand:

ప్రతీ సవంత్సరం కొన్ని లక్షల్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు…మరి ఆ లెవెల్లో ఉద్యోగాలు ఉన్నాయా అంటే అనుమానమే..అయితే గత 2 సవంత్సరాల కాలంలో..దాదాపు 4,25,000 ఉద్యోగులను ఆయా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంటికి పంపాయి.

Also Read: https://www.youtube.com/@legandarytrollsadda

ప్రస్తుత ఏడాది 2024లో మొదటి క్వార్టర్ లోనే ఏకంగా 80 వేలకు పైగా టెకీల జాబ్స్ ఊడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 279 కంపెనీలకు చెందినవారు ఈ జాబితాలో ఉన్నారని ‘లేఆఫ్.ఎఫ్‌వైఐ (layoff.fyi) నివేదికలో ఉంది. మే 3 వరకు మొత్తం 80,130 మంది ఉద్యోగులను ఆయా కంపెనీలు తొలగించాయని తెలిపింది.

Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1

ఆ నివేదిక ప్రకారం అమెరికాకు చెందిన “స్ప్రింక్లర్”, ఫిట్‌నెస్ కంపెనీ “పెలోటన్”తో పాటు చాలా కంపెనీలు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ చర్యలలో భాగంగా సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కూడా దాదాపు 200 మందిని తొలగించిందని తెలిపింది. మరోవైపు టెస్లా కూడా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా తన సిబ్బందిలో 10 శాతం మందికి (దాదాపు 14 వేల మందికి పైగా) ఉద్వాసన పలికిన విషయం విదితమే.

Also Read: Legandarywood Prabhas Kamal movies are releasing in a single day – Legandarywood

అయితే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలకు ముప్పు ఉందని…ఈ ఉద్యోగాలని “ఏఐ” తో రీప్లేస్ చేస్తారని విశ్లేషించారు.

Also Read: Legandarywood Samantha will test her luck as a producer – Legandarywood

About the Author

Leave a Reply

*