బోట్ నుంచి తొలిసారి ఆ ఫీచర్‌తో Smartwatch – ముందుగా కొంటే తక్కువ ధరకే..
దేశీయ పాపులర్ సంస్థ బోట్ (boAt) నుంచి మరో స్మార్ట్‌వాచ్ మార్కెట్‌లోకి వచ్చింది. అయితే తొలిసారిగా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో స్మార్ట్‌వాచ్‌ను బోట్ తీసుకొచ్చింది. బోట్ ప్రీమియా (boAt Primia) పేరుతో ఈ వాచ్ లాంచ్ అయింది. సర్క్యులర్ డయల్, AMOLED డిస్‌ప్లేతో లుక్ పరంగా ఆకర్షణీయంగా ఉంది. స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయిన సమయంలో వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. ఇందుకోసం ఇన్‌బుల్ట్‌గా వాచ్‌లో స్పీకర్, మైక్రోఫోన్ ఉంటాయి. అలాగే ఈ వాచ్ వాయిస్ అసిస్టెంట్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది. మెటాలిక్ డిజైన్, లెదర్ స్ట్రాప్‌తో లుక్ కూడా బాగా ఉంది. boAt Primia స్మార్ట్‌వాచ్‌ను రూ.3,999కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే ఇందుకు ఓ నిబంధన ఉంది.
బోట్ ప్రీమియా ధర
boAt Price in India | బోట్ ప్రీమియా స్మార్ట్‌వాచ్ సాధారణ ధర రూ.4,999 కాగా.. అమెజాన్‌లో ఓ స్పెషల్ ఆఫర్ ఉండనుంది. రేపు (మే 19) మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో ఈ స్మార్ట్‌వాచ్ సేల్‌కు రానుంది. తొలి 1,000 మంది కస్టమర్లు రూ.3,999కే ఈ వాచ్‌ను సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత సాధారణ ధరకే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
బోట్ ప్రీమియా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
boAt Primia Specifications, features : 454×454 రెజల్యూషన్ ఉన్న 1.3 ఇంచుల సర్క్యులర్ AMOLED డిస్‌ప్లేతో బోట్ ప్రీమియా స్మార్ట్‌వాచ్ వస్తోంది. మెటాలిక్ డిజైన్, లెదర్ స్ట్రాప్స్ ఉండగా.. డయల్ కుడివైపున రెండు బటన్స్ ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్ (Google Assistant), సిరి (Siri) వాయిస్ అసిస్టెంట్‌లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. నిరంతర హార్ట్‌రేట్ సెన్సార్, SpO2 సెన్సార్, స్లీప్ ట్రాకర్, స్ట్రెస్ మానిటర్ లాంటి హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే 11 యాక్టివ్ సోర్ట్స్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి.
స్మార్ట్‌ఫోన్‌కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయినప్పుడు బోట్ ప్రీమియా స్మార్ట్‌వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. కాల్స్ కోసం ఈ వాచ్‌లో ఇన్‌బుల్ట్‌గా స్పీకర్, మైక్రోఫోన్ ఉంటుంది. గూగుల్ ఫిట్, యాపిల్ హెల్త్ ఇంటిగ్రేషన్‌కు కూడా ఈ స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది. ఇక బోట్ క్రెస్ట్ (boAt Crest) యాప్ ద్వారా వాచ్ సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు. ఫిట్‌నెస్ స్టాట్స్ చూడవచ్చు.
ఫుల్ చార్జ్‌పై బోట్ ప్రీమియా స్మార్ట్‌వాచ్ 7 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెంట్ కోసం IP67 రేటింగ్‌తో ఈ వాచ్ వస్తోంది. అలాగే కనెక్ట్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే నోటికిఫికేన్లను వాచ్‌లో పొందవచ్చు. మ్యూజిక్‌ను కూడా కంట్రోల్ చేయవచ్చు.