Pakistani air hostesses are vanish in Canada
Pakistani air hostesses are vanish in Canada:
ఉత్తర అమెరికా ఖండ దేశమైన కెనడాలో పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన… ఎయిర్ హోస్టెస్ లు మాయమవడం తీవ్ర కలకలానికి దారితీస్తోంది.
గత నెలలో ఒక ఎయిర్ హోస్టెస్ కనిపించకుండా పోగా.. తాజాగా మరో మహిళ.. ఇలా గత ఏడాది నుంచి ఇప్పటివరకు తొమ్మిది మంది ఎయిర్ హోస్టెస్ లు కెనడాలో అదృశ్యం అయ్యారు.
Also Read: Legandarywood Kannada Beauty Selected for Balayya Movie – Legandarywood
కాగా కెనడాకు వచ్చిన పాకిస్థానీ ఎయిర్ హోస్టెస్ లు ఇలా మాయం కావడం 2019 నుంచే జరుగుతోందట. ఇలా అదృశ్యమవుతున్న సిబ్బంది కెనడాలో ఆశ్రయం పొందుతున్నట్లు పాకిస్థానీ ఎయిర్ లైన్స్ నమ్ముతోంది.
వివరాలలోకి వెళితే, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి కెనడాకు వెళ్లిన పాకిస్థాన్ ఎయిర్ లైన్ విమానం పీకే–782లో మరియం రజా అనే ఎయిర్ హోస్టస్ ఉన్నారు. కెనడాలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన టొరంటోలో దిగిన మరియం రజా..బస చేసిన గదిని అధికారులు పరిశీలించగా…అక్కడ ఆమె యూనిఫామ్ తోపాటు ‘థ్యాంక్యూ పీఐఏ’ అని రాసి ఉన్న ఓ లేఖను గుర్తించారు. పీఐఏ అంటే… పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ | మరియం రజా గత పదిహేను సంవత్సరాలుగా ఇందులో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
కొన్ని సంవత్సరాల క్రితం డ్యూటీలో ఉన్న ఓ విమానయాన ఉద్యోగి ఇలాగే పారిపోయి కెనడాలో స్థిరపడ్డారని తెలిసింది | అనంతరం అనేకమందికి ఆ ఉద్యోగి సలహా ఇవ్వడంతో మిగతావారు కూడా అదే బాట పట్టినట్టు | పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ అధికారి ఒకరు సెలవిచ్చారు.
Also Read: Legandarywood Pan India Star Prabhas Latest Movie Updates – Legandarywood