వైసీపీ నేతకి షాకిచ్చిన మహిళ.. ఏం జరిగిందంటే!
ఏపీ అధికార పార్టీకి ఓ మహిళ షాక్ ఇచ్చింది. ”పథకాలు తీసుకున్నాం.. అయితే ఏంటి? మీరు చెప్పినట్టు వినాలా? మీ ముల్లె నుంచి తీసుకొచ్చి.. పథకాలు అమలు చేస్తున్నారా? మీ జేబులో జీతాలు తెచ్చి మాకిస్తు న్నారా?
మీరు చెప్పినట్టు వినడానికి?” అని నిప్పులు చెరిగింది. దీంతో వైసీపీ నాయకులు షాక్ అయ్యారు. వైకాపా సర్కార్ చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో.. డ్వాక్రా మహిళలు పాల్గొనాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది.
ఈ క్రమంలో విజయవాడకు చెందిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఓ డ్వాక్రా మహిళకు ఫోన్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “గడప గడపకు మన ప్రభుత్వం” పేరుతో వైసీపీ సర్కార్ చేపట్టిన కార్యక్రమానికి.. హాజరుకావా లంటూ డ్వాక్రా మహిళలపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలో.. విజయవాడలోని పశ్చిమ నియోజక వర్గంలో.. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఈ కార్యక్రమాని చేపట్టారు.
ఇందులో పాల్గొనాలని ఓ డ్వాక్రా మహిళకు ఫోన్ చేశారు. ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి హాజరుకాలని ఒత్తిడి చేశారు. దాంతో సదరు మహిళ ఎదురు తిరిగి.. “పథకాలు తీసుకుంటే ప్రభుత్వ కార్యక్రమాలకు రావాలా? .. మీ జేబులో డబ్బులు మాకు ఇస్తున్నారా? ఎందుకు రావాలి. ఎండగా ఉంది. నేను రాను. అయినా.. ప్రతి ప్రభుత్వం ఏదో ఒకటి ఇస్తూనే ఉందిగా” అంటూ ప్రశ్నించింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో మాజీ మంత్రి వెల్లంపల్లి షాక్కు గురయ్యారు. ఏం చేయాలో తెలియక ఆయన తలపట్టుకున్నారు.
ఇదిలావుంటే.. డ్వాక్రా మహిళ మాట్లాడుతున్న విధానం బట్టి.. ఆమె విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మనిషి కాదని.. సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన మహిళ అయి ఉంటుందని.. బ్లాక్ మెయిల్ రాజకీయాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.