లాక్ డౌన్ ఎఫెక్ట్: బాలికల్లో ముందస్తు రజస్వల

కరోనా మహమ్మారి సృష్టించిన విలయంతో ఇప్పటికీ కొందరు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కొందరు కరోనాతో ప్రాణాలు విడవగా.. మరికొందరు కరోనా బారిన పడి కోలుకున్నా.. మానసిక శారీరక బాధలతో ఇబ్బందులు పడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమించి కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో కరోనా ఎఫెక్ట్ బాలికలపై కూడా ప్రభావం చూపింది. కరోనా లాక్డౌన్ తో ఎక్కువకాలం ఇళ్లలో మగ్గిన బాలికలు విద్యార్థులు తీవ్ర మానసిక ఆవేదన చెందారు. కొందరు శారీరకంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా పూణె వైద్యులు చేసిన పరిశోధనలు భయంకన నిజాలు వెలిబుచ్చారు. పీడియాట్రిక్ ఎండో క్రైనాలజీ అండ్ మెటబాలిజం జర్నల్ లో పరిశోధన నివేదిక ప్రచురించబడింది.

ఈ నివేదిక ప్రకారం లాక్డౌన్ ప్రభావం బాలికలపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వాళ్లు యుక్తవయసుకు రాకముందే రజస్వల అయినట్లు తెలిపింది. గతంలో కంటే లాక్డౌన్ సమయంలో రసజ్వల అయిన వారి సంఖ్య 3.6 రేట్లు పెరిగినట్లు తెలిపింది. అయితే దీనికి కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు మరింతగా పరిశోధనలు చేయాలని పరిశోధకులు అంటున్నారు. సాధారణంగా బాలికలు 13 నుంచి 15 ఏళ్లలో రజస్వల అవుతారని కానీ లాక్డౌన్ ప్రభావంతో 8 నుంచి 9 ఏళ్లలోనే ఇలా మారిన వారి సంఖ్య పెరిగిందని పూణె నివేదిక తెలిపింది.

ఇలా తొమ్మిదేళ్లకే యవ్వనంలోకి రావడాన్ని ప్యూబర్టీ గా పేర్కొంటారు. ప్యూబర్టీ కేసులు లాక్డౌన్లోనే అధికంగా నమోదైనట్లు పూణెలోని జహంగీర్ ఆసుపత్రి వైద్యలు గుర్తించారు. దీనిపై 2018 సెప్టెంబర్ 1 నుంచి పిభ్రవరి 29 2020 వరకు ఉన్న సమాచారాన్ని భట్టి పరిశోధనలు చేశారు. అంటే మార్చి 1 2020 నుంచి సెప్టెంబర్ 30 2021 వరకు ఉన్న కేసులను విశ్లేషించారు. లక్డౌన్ ముందు వచ్చిన మొత్తం 4208 కేసుల్లో కేవలం 59 మాత్రమే ైపీసీసీవి ఉండేవని కానీ లాక్డౌన్ సమయంలో వచ్చిన 3053 కేసుల్లో 155 ఇటువంటివేనని గుర్తించారు.

సాధారణ వయసు రాకముందే యవ్వనంలోకి మారడానికి అనేక కారణాలున్నాయి. మానసిక ఒత్తిడి ఆహారపు అలవాట్లు ఇలా మారేందుకు కారణమవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే మొబైల్ ఫోన్ల ఎక్కువగా వాడడం వల్ల మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పరిశోధనలో తేలిందన్నారు.

లాక్డౌన్ సమయంలో బాలికలు ఎక్కువగా మానసిక ఇబ్బందులకు గురయ్యారు. ఇంట్లోనే అధికంగా ఉండడంతో ఈ ప్రభావం ఎక్కవైందని పిల్లల  వైద్యులు పేర్కొంటున్నారు. మరోవైపు శానిటైజర్లు ఇతర రసాయనిక పదార్థాలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపడం కారణమేనని అంటున్నారు.

అయితే ప్యూబర్టీ కి లాక్డౌన్ కారణమేనని భావించినా ఇంకా లోతుగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని పూణే వైద్యులు పేర్కొన్నారు. లాక్డౌన్ కు ముందే కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయని అయితే లాక్డౌన్లో ఈ కేసులు ఎక్కువగా పెరిగాయని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పూణె వైద్యులు తెలుపుతున్నారు.

About the Author

Leave a Reply

*