Xiaomi TV A2 Smart TVs : 4K డిస్‌ప్లే, డాల్బీ విజన్ సపోర్ట్‌తో షావోమీ కొత్త సిరీస్ Smart TVs లాంచ్

Xiaomi TV A2 Smart TVs : షావోమీ టీవీ ఏ2 సిరీస్ లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో నాలుగు డిస్‌ప్లే వేరియంట్లు గ్లోబల్‌గా విడుదలయ్యాయి. 32 ఇంచులు, 43 ఇంచులు, 50 ఇంచులు, 55 ఇంచులు మోడల్స్‌ను షావోమీ తీసుకొచ్చింది.

Xiaomi TV A2 Smart TVs :

షావోమీ (Xiaomi) నుంచి కొత్త సిరీస్ స్మార్ట్ టీవీలు గ్లోబల్‌గా లాంచ్ అయ్యాయి. షావోమీ టీవీ ఏ2 సిరీస్ (Xiaomi TV A2 Series) విడుదలైంది. నాలుగు డిస్‌ప్లే సైజ్ వేరియంట్లలో టీవీలు వచ్చాయి. 32 ఇంచులు, 43 ఇంచులు, 50 ఇంచులు, 55 ఇంచుల స్క్రీన్ సైజ్‌ల్లో షావోమీ టీవీ ఏ2 సిరీస్ విడుదలైంది. 32 ఇంచుల మోడల్ HD రెజల్యూషన్ ప్యానెల్‌తో వస్తోంది. 43, 50, 55 ఇంచుల డిస్‌ప్లే టీవీ మోడల్స్ 4కే అల్ట్రా హెచ్‌డీ (4K Ultra HD) రెజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్‌ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై టీవీలు రన్ అవుతాయి. త్వరలో ఈ టీవీలు భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. Xiaomi TV A2 స్మార్ట్ టీవీ సిరీస్ ధరలు, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు చూడండి.

Xiaomi TV A2 సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

178 వ్యూయింగ్ యాంగిల్, 60Hz రిఫ్రెష్ రేట్ ఉండే LED బ్యాక్‌లిట్ LCD డిస్‌ప్లేలతో షావోమీ టీవీ ఏ2 సిరీస్ మోడల్స్ వస్తున్నాయి. 32 ఇంచుల వేరియంట్ హెచ్‌డీ (1366×786 పిక్సెల్) రెజల్యూషన్ ప్యానెల్‌ను కలిగి ఉంది. మిగిలిన 43, 50, 55 ఇంచుల డిస్‌ప్లే మోడల్స్ 4K Ultra HD (3840×2160 పిక్సెల్స్) రెజల్యూషన్ డిస్‌ప్లేలతో వస్తున్నాయి. 4కే మోడల్స్ 10-బిట్ కలర్ డెప్త్, హెచ్‌డీఆర్ 10, డాల్బీ విజన్, హెచ్‌జీఎల్‌కు సపోర్ట్ చేస్తాయి. బెజిల్‌లెస్ డిజైన్‌తో షావోమీ (Xiaomi) ఈ టీవీలను రూపొందించింది.

క్వాడ్‌కోర్ కోర్‌టెక్స్-ఏ55 (Quad-core Cortex-A55) సీపీయూపై షావోమీ టీవీ ఏ2 సిరీస్ మోడల్స్ రన్ అవుతాయి. ఆండ్రాయిడ్‌ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. 32 ఇంచుల మోడల్‌లో 1.5జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ ఉంటుంది. 4కే వేరియంట్ టీవీలు 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉన్నాయి.

Xiaomi TV A2 32 ఇంచుల మోడల్ 20 వాట్ల సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లను కలిగి ఉంది. 43, 50, 55 ఇంచుల మోడల్స్ టీవీల్లో 24 వాట్ల సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లు ఉంటాయి. ఈ టీవీలన్నీ డాల్బీ ఆడియో, DTS-HDకి సపోర్ట్ చేస్తాయి. బేస్ మోడల్‌కు రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు ఉండగా.. మిగిలిన మూడు వేరియంట్లకు మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు ఉంటాయి. అన్ని టీవీలు రెండు యూఎస్‌బీ పోర్ట్స్, వైఫై, బ్లూటూత్ వెర్షన్‌ 5.0తో వస్తున్నాయి.

Xiaomi TV A2 సిరీస్ ధరలు

ఇప్పటికైతే Xiaomi TV A2 సిరీస్‌ల 55 ఇంచుల మోడల్ ధరను మాత్రమే షావోమీ ప్రకటించింది. దీని ధర యూరప్‌ మార్కెట్‌లో 529 యూరోలు (సుమారు రూ.43,600)గా ఉంది.

About the Author

Leave a Reply

*